Skip to content
Saturday, August 1, 2026

    Delhi Sistakaranam

    • Home
    • Activity
      • All Activities
    • Community
      • History
      • Mission
      • VIVAHA VEDIKA
      • Job Posting
    • Registration
    • Log In

    • Home
    • 2023
    • December
    • 21
    • ఆనందోత్సాహాలతో ఘనంగా జరిగిన పిక్నిక్ -టీమ్ ఢిల్లీ శిష్టకరణం వారికి అభినందనలు

    ఆనందోత్సాహాలతో ఘనంగా జరిగిన పిక్నిక్ -టీమ్ ఢిల్లీ శిష్టకరణం వారికి అభినందనలు

    Prasad Patnaik December 21, 2023 in News - 0 Minutes

    17-12-2023 ఆదివారంనాడు దేశరాజధాని ఢిల్లీ లోని తల్కటోరా గార్డెన్స్ వేదికగా ఢిల్లీ మరియు యన్ సి ఆర్ ప్రాంత వాసులయిన శిష్టకరణాల మెగా పిక్నిక్ సంబరంగా జరిగింది..సుమారు 120 మందికి పైగాహాజరయిన ఈ పిక్నిక్ ఆద్యంతమూ ఆనందోత్సాహాలతో వేడుకగా జరిగింది.
    నిరుడు 130 మంది హాజరవగా ఈ సంవత్సరం 150 వస్తారనుకున్నా 120 మందే రావడం నిర్వాహకులను నిరాశపరిచింది..150 మందికి ఏర్పాట్లు చేయడంజరిగింది. ముందు పేర్లు ఇచ్చి చివరినిమిషంలో కొంతమంది రాకపోవడంవలన ఫుడ్ మిగిలిపోవడం జరిగినది అయితే ఈ సం. ఎక్కువమంది సీనియర్స్ మరియు చిన్నపిల్లలు ఎక్కువమంది హాజరయి సరదాగా గడిపారు
    హాజరయినబంధువులతో కోలాహలంగా..డాన్సులతో..ఆటపాటలతో గడిపారు. హాజరయిన కుటుంబాలన్నిటికి టీకప్పు సెట్ లు బహుమతిగా అందజేయడం జరిగింది. మహిళలందరికి గాజులు బహుమానంగా ఇవ్వడం సంతోషమనిపించింది. చంటి పిల్లలకు బాటిల్స్ అందించారు.లెమన్ అంద్ స్పూన్ , మ్యూజికల్ ఛైర్స్ , కపుల్స్ గేమ్ తదితర ఆటలపోటీలలో విజేతలకు ఖరీదైన ఐస్ క్రీమ్ కప్ సెట్స్ , గాజుగ్లాసులు పెద్దవి సెట్లు తదితర బహుమతులందజేశారు. ముందుగావచ్చినవారికి రెండువేలరూపాయల విలువచేసే చక్కని నెక్లేస్ సెట్ బహుమతిగా అందించారు. బెస్టుకపుల్స్ కు బహుమతులిచ్చారు.
    అతిథులందరూ ఉదయం 8-30గంకే రావడం ప్రారంభించారు. ఉదయం 9-30 గం కు గణేశ్ పూజతో పిక్నిక్ ప్రారంభించడంజరిగినది. చక్కని బ్రేక్ ఫాస్టు ఏర్పాటుచేశారు. అందరిపరిచయాలు అయినతరవాత ఆటలపోటీలు జరిగాయి. రుచికరమైన శాఖాహార మరియు మాంసాహార భోజనం తరవాత సీనియర్ అతిథులకు మరియు శ్రీ జి వి జి యుగంధర్ గారికి సన్మానంచేయడం జరిగినది. ఈ పిక్నిక్ కి హాజరయిన వారిలో శ్రీ వివిరామకృష్ణారావుగారు, డా. యస్ వి ఏ వి ప్రసాద్ గారు, శ్రీ యస్ మోహనరావుగారు, శ్రీ కె శ్రీరామచంద్రమూర్తిగారు, డా.ఆర్ నిఖిల్ కుమార్ పట్నాయక్ గారు, శ్రీ వి పండరిగారు, శ్రీ జీ ఆర్ కె రావుగారు,శ్రీ శ్రీహర్షగారు, శ్రీ సంజయ్ గారు, శ్రీ కరకవలస శంకరరావుగారు, శ్రీ సూర్యాపట్నాయక్ గారు, శ్రీ యస్ నరసింగరావుగారు, శ్రీ రొంపల్లి ఉమారామలింగేశ్వరరావుగారు, శ్రీ సదాశివుని చేతన్ కుమార్ గారు, శ్రీమతి బి గిరిజాదేవిగారు, శ్రీ సీ యే సుధీర్ డబ్బీరు గారు,శ్రీమతి డి శిల్పగారు (శిష్టకరణంలేఖ పత్రికతరఫున) , శ్రీ బి ప్రవీణ్ రావుగారు, శ్రీ శ్రీనివాస్ పట్నాయక్ గారు, శ్రీ దశమంతరావు సుధీర్ గారు, శ్రీ డబ్బీరు ప్రభాకర్ పట్నాయక్ గారు, శ్రీ రాజేష్ కుమార్ గారు,శ్రీ రవిపట్నాయక్ గారు, శ్రీ డీ కే రామచంద్రగారు, శ్రీ యస్ వెంకటేష్ బాబుగారు, శ్రీయస్ భాస్కరరావుగారు తదితరులు వారికుటుంబసభ్యులు పాల్గొన్నారు.
    శ్రీ డబ్బీరు శివ భరత్ కుమార్ ,లీగల్ హెడ్ , ఈడి గారికి , శ్రీ డబ్బీరు లక్ష్మణదాసుగారికి ,శ్రీమతిడబ్బీరు మాధవిగారికి, ఆటపాటలలో పోటీలలో చురుకుగా పాల్గొన్న వారిలో శ్రీమతి ధనలక్ష్మిగారు, శ్రీ భీమగారు, శ్రీమతి గీతాంజలిగారు, శ్రీమతి గిరిజగారు, శ్రీమతి దుర్గగారు,శ్రీ శివ్వాంహరిగారు,శ్రీ విజయకుమార్ గారు, శ్రీ లక్ష్మీపతిగారు, శ్రీమతి లీనాగార్లను ఇతర నిర్వాహకులు పిక్నిక్ జయప్రదంగా జరగడానికి సహాయపడ్డారు. వీరందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. సాయంత్రం టీ, అల్పాహారంతో జయప్రదంగా ముగిసింది..ఇన్ని సంవత్సరాలుగా ఢిల్లీలో ఉన్నా అందరినీ ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉందని చాలామంది సంతోషం వ్యక్తంచేశారు.

    చి.జియూ చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ , చి.రావుపల్లిప్రణీత చేసిన క్లాసికల్ డాన్స్ మరియు సుధీర్ మున్నా లు చేసిన డాన్స్ లు ఆకట్టుకున్నాయి. చిన్నపిల్లల మ్యూజికల్ ఛైర్స్ సరదాగా ఉండింది. శ్రీమతి డి శిల్పగారు శిష్టకరణంలేఖ పత్రిక గురించి అందరికి వివరించారు. డిజిటల్ లేఖపత్రికను ఉచితంగా ఎలా పొందవచ్చో తెలియజేశారు.

    రెండునెలలనుంచీ అవిరామంగా అందరినీ ఆహ్వానిస్తూ ..ముందస్తుగా ఏర్పాట్లు చేయడం తో సజావుగ జరిగినందుకు నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తున్నాము.

    పోలుమహంతి ఉమామహేశ్వరరావు
    అధ్యక్షులు
    ఆంధ్రప్రదేశ్ శిష్టకరణసంఘం(63/1979)
    మరియు కార్యవర్గసభ్యులు

    Post navigation

    Previous: Enjoying in picnic.
    Next: Pursuit of Happiness

    Related Posts

    Picnic 2025
    November 30, 2025
    Picnic 2024
    December 15, 2024
    congratulations
    September 19, 2024

    Prasad Patnaik

    Learn More →

    Leave a Reply Cancel reply

    You must be logged in to post a comment.

    Recent Posts

    • Picnic 2025
    • Picnic 2024
    • congratulations
    • Change Management
    • Bhagvat Gita

    Archives

    • November 2025
    • December 2024
    • September 2024
    • February 2024
    • January 2024
    • December 2023
    • October 2023
    • July 2023
    • June 2023
    • May 2023
    • March 2023
    • February 2023
    • May 2021
    • March 2021

    Quote of the Day

    more Quotes
      Proudly powered by WordPress | Theme: BoldNews by WalkerWP.

      Subscribe for Updates

      Join the Delhi Sistakaranam community updates.

      Protected by Google reCAPTCHA v3.

      Ask Me