Skip to content
DSK Delhi Sistakaranamఢిల్లీ శిష్టకరణం సంఘం

Bangalore Skills Meet

 ఈరోజు 30-7-2023 ఆదివారంనాడు బెంగళూరు శిష్టకరణాల మీట్ (BESKAM)  బెంగళూరులోని BEL ఆఫీసర్స్ క్లబ్ వేదికగా ఘనంగా జరిగినది. ఈ మీట్ కి వందమందికి పైగా శిష్టకరణాలు హాజరయారు.శ్రీ చౌదరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ మీట్ కి ముఖ్యఅతిథులుగా ఆలిండియా శిష్టకరణం అధ్యక్షులు శ్రీ డబ్బీరు వెంకటకృష్ణారావుగారు , సంఘం ఇతరనాయకులు శ్రీ శరత్కవిగారు, శ్రీ గుమ్మా ఉమాశంకర్ పట్నాయక్ గారు, శ్రీ నరేష్ గారు, లేఖనుండి శ్రీనరహరిగారు హాజరయారు. వీరిని శ్రీ రామ్ జీ పట్నాయక్ గారు వేదికపైకి ఆహ్వానించారు. ఉదయం 10 గం. ప్రారంభమైన సమావేశం చక్కని కార్యక్రమాలతో పిల్లల డాన్స్ మరియు పాటలప్రోగ్రాములతో ఆకట్టుకుంది..తదుపరి మధ్యాహ్నం 2గం. లంచ్ ఏర్పాటుచేయబడినది..ఈ సమావేశంలో శ్రీ డబ్బీరు వెంకటకృష్ణారావుగారు శిష్టకరణాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాలగురించి వివరించారు. శ్రీ చౌదరిప్రసాద్ గారు అతిథులకు, హాజరయిన పెద్దలకు, బెంగళూరు శిష్టకరణాలందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఇంతచక్కటి కార్యక్రమం నిర్వహించిన బెంగళూరు శిష్టకరణాలు టీమ్ సభ్యులకు అభినందనలు తెలియజేద్దాం.

హృదయపూర్వక అభినందనలు

పోలుమహంతి ఉమామహేశ్వరరావు
అధ్యక్షులు
ఆంధ్రప్రదేశ్ శిష్టకరణసంఘం(63/1979)
మరియు కార్యవర్గసభ్యులు
30-7-2023

Leave a Reply